Rashmi Gautam: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ రష్మి స్పందన

Rashmi Gautam comments on casting couch
  • క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే గళమెత్తిన ఎంతో మంది నటీమణులు
  • అవకాశాల కోసం దర్శకనిర్మాతలతో గడపాలనేది చాలా మంది అభిప్రాయం
  • అలా చెప్పడం చాలా సులభం అన్న రష్మి
బుల్లితెర యాంకర్ రష్మి సినిమాలతో కూడా చాలా బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో కూడా రష్మి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎన్నో విషయాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు వెల్లడిస్తుంటుంది. తాజాగా సినీ పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలన్నా, పెద్ద హీరోయిన్ కావాలన్నా దర్శకులు, నిర్మాతలతో గడపాలని ఇప్పటికే చాలా మంది నటీమణులు చెప్పిన సంగతి తెలిసిందే. 

దీనిపై రష్మి స్పందిస్తూ... చాలా మందికి ఇలా చెప్పడం చాలా సులభం అని వ్యాఖ్యానించింది. ఇలా చెప్పడం ఈజీనే కానీ ఆ స్థాయికి చేరుకున్న వారికి మాత్రమే బాధ తెలుస్తుందని చెప్పింది. టాప్ పొజిషన్ కు చేరుకోవడానికి వారు ఎంత కష్టపడతారో అనే విధంగా ఆమె స్పందించింది
Rashmi Gautam
Tollywood
Casting Couch

More Telugu News