manipur: మణిపూర్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ.. 3 స్థానాలలో ఇంకా పూర్తికాని కౌంటింగ్
- 30 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ
- ఎన్సీపీ, జేడీయూలకు చెరో ఆరు సీట్లు
- 5 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నేటి ఉదయం ప్రారంభం కాగా.. రాత్రి 10 గంటలకు నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. ఇక మిగిలిన మణిఫూర్ ఎన్నికల ఫలితం కూడా తేలిపోయినా.. పూర్తి గణాంకాలు మాత్రం వెల్లడి కాలేదు. కౌంటింగ్‌లో ఇప్పటికే మెజారిటీ స్థానాల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా..ఇంకో మూడు సీట్ల ఓట్ల లెక్కింపు మాత్రం రాత్రి 10 గంటలు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది.
కౌంటింగ్ జరుగుతున్న మూడు సీట్లను పక్కనపెడితే.. మొత్తం 60 సీట్లు కలిగిన మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ ఇప్పటికే 30 సీట్లను గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకో స్థానం వెనుకే ఉంది. అయితే కౌంటింగ్ జరుగుతున్న మూడు సీట్లలో రెండు సీట్లు బీజేపీ ఖాతాలోనే పడే అవకాశాలున్నాయి. ఈ రెండు సీట్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం 5 సీట్లనే దక్కించుకోగా.. ఎన్సీపీ, జేడీయూ చెరో ఆరు స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్సీపీ ఇంకో సీటులో ఆధిక్యంలో కొనసాగుతోంది. స్వతంత్రులు, చిన్నా చితక పార్టీలు ఏకంగా 10 సీట్లలో విజయం సాధించాయి. వెరసి స్పష్టమైన మెజారిటీకి అడుగు దూరంలో నిలిచిన బీజేపీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీనే మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.