Andhra Pradesh: ఏపీ బడ్జెట్ లో రెడ్డి కార్పొరేషన్ కు రూ.3,088.99 కోట్లు, కమ్మ కార్పొరేషన్ కు రూ.1,899.74 కోట్లు.. మరిన్ని వర్గాలకు కేటాయింపులివీ..!
- బీసీ కార్పొరేషన్ కు రూ.6,345.82 కోట్లు
- అమ్మ ఒడి కోసం రూ.6,500 కోట్ల కేటాయింపు
- వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.2 వేల కోట్ల బడ్జెట్
వివిధ సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చింది. కాపుల సంక్షేమం కోసం రూ.3,531.68 కోట్లను కేటాయించింది. రెడ్డి సంక్షేమం కార్పొరేషన్ కు రూ.3,088.99 కోట్లు, కమ్మ సంక్షేమ కార్పొరేషన్ కు రూ.1,899.74 కోట్లను కేటాయించింది. వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ.500 కోట్ల కేటాయింపులను చేసింది. అమ్మ ఒడి కోసం రూ.6,500 కోట్లు, వైఎస్సార్ చేయూతకు రూ.4,235 కోట్లను బడ్జెట్ లో కేటాయించింది.
- క్రిస్టియన్ కార్పొరేషన్ కు రూ.113.4 కోట్లు
- బ్రాహ్మణ కార్పొరేషన్ కోసం రూ.455.23 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అందులో అర్చకుల కోసం రూ.122 కోట్ల కేటాయింపులను చేసింది.
- వైశ్య సంక్షేమ కార్పొరేషన్ కు రూ.915.49 కోట్లు
- క్షత్రియ సంక్షేమ కార్పొరేషన్ కు రూ.314.02 కోట్లు
- ఈబీసీల సంక్షేమానికి రూ.139.18 కోట్లు
- బీసీ కార్పొరేషన్ కు రూ.6,345.82 కోట్లు
- వైఎస్సార్ వాహనమిత్రకు రూ.260 కోట్లు
- నేతన్న నేస్తానికి రూ.199.99 కోట్లు
- మత్స్యకార భరోసా కోసం రూ.120.49 కోట్లు
- మత్స్యకారుల డీజిల్ సబ్సిడీకి రూ.50 కోట్లు
ఆరోగ్య రంగంలో వివిధ పథకాలకు కేటాయింపులివీ..
- వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.2 వేల కోట్లు
- ఆసుపత్రుల్లో నాడు నేడుకు రూ.1,603 కోట్లు
- నేషనల్ హెల్త్ మిషన్ కు రూ.2,462.03 కోట్లు
- మెడికల్ కాలేజీల్లో పనులకు రూ.753.84 కోట్లు
- కొత్త మెడికల్ కాలేజీ ఆసుపత్రుల కోసం రూ.320 కోట్లు
- ఇప్పటికే ఉన్న ఆసుపత్రులను కాలేజీలగానూ మార్చేందుకు రూ.250.45 కోట్లు
- వైఎస్సార్ ఆరోగ్య ఆసరాకు రూ.300 కోట్లు
- గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు రూ.170 కోట్లు
- 104 సేవలకు రూ.140 కోట్లు
- 108 సర్వీసులకు రూ. 133.19 కోట్లు
- ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపునకు రూ.100 కోట్లు
- ఎన్ హెచ్ఎం మౌలిక వసతులకు రూ.695.88 కోట్లు
- ఆశా వర్కర్లకు గౌరవ వేతనం కోసం రూ.343.97 కోట్లు
- కుటుంబ సంక్షేమ కేంద్రాలకు రూ.218 కోట్లు
- ఆయుష్మాన్ భారత్ మౌలిక వసతుల మిషన్ కు రూ.250 కోట్లు