Kyiv: ఉక్రెయిన్ రాజధానిని నలువైపుల నుంచి చుట్టుముట్టిన రష్యా సేనలు
- గత రెండు వారాలకు పైగా రష్యా దాడులు
- పోరాడుతున్న ఉక్రెయిన్ సేనలు
- కీవ్ కు 15 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు
- ఫైరింగ్ పొజిషన్లలో రష్యా శతఘ్నులు
ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా సేనలు ముందంజ వేస్తున్నాయి. కీవ్ ను రష్యా సాయుధ బలగాలు నలువైపుల నుంచి చుట్టుముట్టాయి. కీవ్ కు ప్రస్తుతం కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే రష్యన్ సేనలు ఉన్నాయి. మరికొన్ని గంటల్లో కీవ్ రష్యా హస్తగతం అయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
కీవ్ కు అత్యంత సమీపంలో రష్యా సైనిక కాన్వాయ్ ఉన్నట్టు మ్యాక్సార్ శాటిలైట్ ఫొటోల్లో వెల్లడైంది. చివరిసారిగా రష్యన్ మిలిటరీ కాన్వాయ్ ఆంటోనోవ్ ఎయిర్ పోర్టు వద్ద ఉన్నట్టు శాటిలైట్ చిత్రాల్లో స్పష్టమైంది. తాజా చిత్రాలతో పోల్చి చూస్తే రష్యా దళాలు ఎంతో ముందంజ వేసినట్టు తెలుస్తోంది. రష్యన్ శతఘ్ని దళాలు ప్రస్తుతం కీవ్ వెలుపల ఫైరింగ్ పొజిషన్లలో ఉన్నట్టు వెల్లడైంది.