Paytm: కొత్త ఖాతాలు కుదరవు!.. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు!
- పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో నిర్వహణ లోపాలు
- ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు
- ఆడిట్ నివేదిక అందాకే తదుపరి నిర్ణయమన్న ఆర్బీఐ
డిజిటల్ చెల్లింపుల్లో దూసుకుపోతున్న పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించింది. కొత్త ఖాతాలను తెరవొద్దంటూ ఆర్బీఐ.. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ వ్యవస్థకు సంబంధించి ఆడిట్ నిర్వహించేందుకు ఓ ఐటీ ఆడిట్ సంస్థను నియమించుకోవాలని సూచించింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో పర్యవేక్షణా లోపాలు బయటపడిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆడిట్ జరిగాక.. ఆడిట్ సంస్థ ఇచ్చే నివేదికను ఆధారం చేసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అప్పటిదాకా కొత్త ఖాతాలను తెరిచే కార్యక్రమాన్ని తక్షణం నిలిపివేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ సూచించింది.