ICC Womens World Cup 2022: మహిళల ప్రపంచకప్.. విండీస్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్
- పాక్‌పై గెలిచి న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్
- విండీస్‌ను ఓడించడమే లక్ష్యంగా బరిలోకి
- దూకుడుగా ఆడుతున్న యస్తికా భాటియా
న్యూజిలాండ్‌లోని హమిల్డన్ పార్క్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై నెగ్గి ఆత్మవిశ్వాసంతో కనిపించిన మిథాలీ సేన.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓడింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని చూస్తోంది.
బ్యాటింగ్ విభాగంలో ప్రధానంగా సమస్య ఎదుర్కొంటున్నట్టు చెప్పిన కెప్టెన్ మిథాలీ రాజ్ వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుతామని న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత పేర్కొంది. ఈ మ్యాచ్‌లో భారత్, విండీస్ మహిళల జట్టు రెండూ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. ప్రస్తుతం ఐదు ఓవర్లు ముగిశాయి. భారత జట్టు వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. స్మృతి మంధాన నెమ్మదిగా ఆడుతుండగా, యస్తిక భాటియా దూకుడుగా ఆడుతోంది. 6 ఫోర్లతో 29 పరుగులతో క్రీజులో ఉంది.