Somu Veerraju: జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి: సోము వీర్రాజు
- జంగారెడ్డిగూడెంలో 18కి చేరిన మరణాలు
- కారణాలేమిటో కనుక్కోవాలని వీర్రాజు వినతి
- మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో గడచిన నాలుగు రోజుల్లోనే 18 మృత్యువాత పడ్డారు. వాంతులు, విరేచనాలకు గురవుతున్న పట్టణవాసులు ఆసుపత్రుల్లో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే చనిపోతున్నారు. నాటు సారానే ఈ మరణాలకు కారణమని భావిస్తున్నా.. ఈ విషయంపై ఇంకా స్పష్టత అయితే రాలేదు.
ఈ నేపథ్యంలో ఈ మరణాలపై శుక్రవారమే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు పోతున్నా స్పందించరా? అంటూ చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.
తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఈ మరణాలపై స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకుంటున్న వరుస మరణాలపై జగన్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరణాలకు గల నిర్దిష్ట కారణాలను తెలియజేసి ప్రజల్లో భయబ్రాంతులను తొలగించాలని ఆయన కోరారు. అంతేకాకుండా మృతులకు రూ. 5 లక్షల ఏక్స్ గ్రేసియో ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలని వీర్రాజు డిమాండ్ చేశారు.