Vishal: నటుడు విశాల్ రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే..మద్రాస్ హైకోర్టు ఆదేశం

Actor Vishal told to deposit Rs 15 crore in loan dispute against Lyca Productions

  • లైకా సంస్థ నుంచి రూ. 21.29 కోట్ల అప్పు
  • ఒప్పందం ప్రకారం ముందుగా చెల్లించకుండానే సినిమా విడుదలకు రెడీ
  • మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన ‘లైకా’

లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన కేసులో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్‌ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లోగా హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున ఆ సొమ్మును డిపాజిట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అప్పుగా తీసుకున్న రూ. 21.29 కోట్లు చెల్లించకుండానే ‘వీరమే వాగై సుడుం’ అనే చిత్రాన్ని విడుదల చేసేందుకు విశాల్ రెడీ అయ్యారంటూ లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. 

సినిమాను విడుదల చేయడమే కాకుండా శాటిలైట్, ఓటీటీ హక్కులను కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. కాబట్టి సినిమా విడుదల, హక్కుల విక్రయంపై నిషేధం విధించాలని కోరింది. నిన్న ఈ కేసు విచారణకు వచ్చింది. వాదనలు విన్న జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి.. విశాల్ రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News