Saudi Arabia: ఒకే రోజు 81 మందిని ఉరితీసి సంచలనం సృష్టించిన సౌదీ అరేబియా
- కఠిన చట్టాలకు మారుపేరు సౌదీ అరేబియా
- తీవ్ర నేరం చేస్తే శిరచ్ఛేదం
- చేతులు, కాళ్లు నరకడం సాధారణం
సౌదీ అరేబియా తదితర అరబ్ దేశాల్లో చట్టాలు, శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శిరచ్ఛేదాలు, చేతులు, కాళ్లు తెగనరకడాలు అక్కడ కామన్. తాజాగా, సౌదీ అరేబియా ప్రభుత్వం ఒకేరోజున 81 మందిని ఉరితీసి సంచలనం సృష్టించింది.
మరణశిక్షకు గురైన వారిలో కొందరు అల్ ఖైదా, ఐసిస్, యెమెన్ హౌతీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగివున్నట్టు నిర్ధారణ కాగా, కొందరు మహిళలను, పిల్లలను చంపినట్టు తేలింది. దాంతో వారందరినీ నిన్న ఉరితీశారు. వారిలో 73 మంది సౌదీ అరేబియా జాతీయులు కాగా, ఏడుగురు యెమెన్ దేశస్తులు, ఒక సిరియా పౌరుడు కూడా ఉన్నారు.
గత మూడున్నర దశాబ్దాల కాలంలో ఒకేరోజు ఇంతమందికి మరణశిక్ష అమలు చేయడం ఇదే ప్రథమం. 1980లో సౌదీలో ఒకేరోజు 63 మంది తలలు నరికి మరణశిక్ష అమలు చేశారు.