Telangana: రేప‌టి నుంచే తెలంగాణ‌లో ఒంటి పూట బ‌డులు

half day schools in telangana from tomorrow

  • ఉద‌యం 8 నుంచి12.30 గంట‌ల వ‌ర‌కు క్లాసులు
  • పాఠ‌శాల విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ
  • మే 20తో టెన్త్ ప‌రీక్ష‌లు పూర్తి

ఎండ‌లు మండిపోతున్న నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సోమ‌వారం నాడు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 16 నుంచి పాఠ‌శాల విద్యార్థులకు ఒంటి పూట బ‌డులంటూ గ‌తంలో ప్ర‌కటించిన ప్ర‌భుత్వం.. తాజాగా రేప‌టి నుంచే (మార్చి 15) ఒంటి పూట బ‌డుల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లుగా తెలిపింది. ఈ మేర‌కు పాఠ‌శాల విద్యా శాఖ సంచాల‌కురాలు శ్రీ దేవ సేన సోమవారం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

అయితే, ఈ ఉత్తర్వులలో ప్రైవేట్ పాఠ‌శాల‌ల ఊసు ఎత్త‌లేదు. సాధార‌ణంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల మాదిరే ప్రైవేట్ పాఠ‌శాల‌లు కూడా త‌మ టైం టేబుల్‌ను మార్చేసుకుంటున్న‌ నేప‌థ్యంలో ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లోనూ రేప‌టి నుంచే ఒంటి పూట బ‌డులు ప్రారంభ‌మయ్యే అవకాశాలున్నాయి. 

ఇక ఒంటి పూట బ‌డుల సమయం విష‌యానికి వ‌స్తే.. ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు పాఠ‌శాల‌లు ప‌నిచేయ‌నున్నాయి. ఇదిలా ఉంటే.. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఈ ఏడాది మే 20తో ముగియ‌నున్నాయి. ఆ రోజే ఈ విద్యా సంవ‌త్స‌రానికి చివ‌రి దినం కానుంది.

  • Loading...

More Telugu News