Tanuku: టీడీఆర్ బాండ్ల స్కామ్: తణుకు మునిసిపల్ కమిషనర్ సహా ముగ్గురిపై సస్పెన్షన్
- టీడీఆర్ బాండ్ల పేరిట వందల కోట్ల అవినీతి
- వైసీపీ ఎమ్మెల్యే కారుమూరిపై ఆరోపణలు
- ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చిన కొమ్మారెడ్డి
- మునిసిపల్ కమిషనర్ సహా ముగ్గురిపై వేటు
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మునిసిపాలిటీ కేంద్రంగా అవినీతి జరిగిందంటూ టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కొమ్మారెడ్డి ఆరోపణలను తణుకు ఎమ్మెల్యే కారుమూరి ఖండించగా.. తాజాగా ఇదే స్కాం ఆధారంగా తణుకు మునిసిపల్ కమిషనర్ సహా ముగ్గురు కీలక అధికారులను ఏపీ ప్రభుత్వం గురువారం సస్పెండ్ చేసింది.
తణుకులో టీడీఆర్ బాండ్ల పేరిట వైసీపీ ఎమ్మెల్యే వందల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారంటూ కొమ్మారెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం తణుకు మున్సిపల్ కమిషనర్ వాసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి రామకృష్ణ, సూపర్ వైజర్ ప్రసాద్లను సస్పెండ్ చేసింది. ఈ విషయంపై స్పందించిన కొమ్మారెడ్డి... అవినీతిపై ఇప్పుడేమంటారని ఎమ్మెల్యే కారుమూరిని ప్రశ్నించారు.