Andhra Pradesh: 21న మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడతామని జగన్ చెప్పారు: సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు గుర్నాథం

Jagan said the three capitals bill would be introduced during these meetings said Madigani Gurnatham

  • ఎంపీ నందిగం సురేశ్ ‌తో కలిసి జగన్‌ను కలిసిన శిబిర నిర్వాహకులు
  • మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టాలంటూ వినతిపత్రం
  • జగన్ హామీ ఇచ్చారన్న నేతలు

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తమకు చెప్పారని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం తెలిపారు. ఈ నెల 21న మూడు రాజధానులపై శాసనసభలో చర్చించి బిల్లు ప్రవేశపెడతామని జగన్ తమకు చెప్పారని ఆయన పేర్కొన్నారు.

మూడు రాజధానుల శిబిర నిర్వాహకులు, బహుజన పరిరక్షణ సమితి ఉద్యమ నాయకులు గుర్నాథం, బేతపూడి సాంబయ్య, ఆదాం తదితరులు బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ తో కలిసి నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. 

మూడు రాజధానుల బిల్లును శాసనసభలో మరోమారు ప్రవేశపెట్టాలని కోరుతూ జగన్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని తమకు హామీ ఇచ్చినట్టు గుర్నాథం తెలిపారు.

  • Loading...

More Telugu News