Suma: 'జయమ్మ పంచాయితీ' నుంచి కీరవాణి మార్కు సాంగ్!
- సుమ ప్రధాన పాత్రగా 'జయమ్మ పంచాయితీ'
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- సంగీత దర్శకుడిగా కీరవాణి
- ఏప్రిల్ 22వ తేదీన విడుదల
చాలాకాలం క్రితం దాసరి నారాయణరావు దర్శకత్వంలో కథానాయికగా ఒక సినిమా చేసిన సుమ ఆ తరువాత నుంచి ఆ వైపు వెళ్లలేదు. నిజం చెప్పాలంటే ఆ దిశగా ఆలోచన చేసేంత తీరిక కూడా ఆమెకి లేదు. టీవీ కార్యక్రమాలు .. సినిమా ఫంక్షన్లతో ఆమె ఫుల్ బిజీ. అలాంటి సుమ మళ్లీ ఇంతకాలానికి తెరపైకి వస్తోంది.
సుమ తాజా చిత్రంగా 'జయమ్మ పంచాయితీ' రూపొందింది. బులగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమాకి, విజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు. టైటిల్ ను బట్టే ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అని తెలిసిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేశారు.
'నువ్వో రెక్కా .. అరెరె నేనో రెక్కా .. రెక్కలు రెండు కలిపి చూద్దామింకా .. మనదే కదా చుక్కల ఆకాశం' అంటూ ఈ పాట సాగుతోంది. కీరవాణి సంగీతం .. చంద్రబోస్ సాహిత్యం .. అనిరుధ్ - నీలిమ ఆలాపన బాగున్నాయి. టీనేజ్ లవర్స్ పై చిత్రీకరించిన ఈ పాట ఒక్కసారి చూడగానే .. వినగానే మనసుకు పట్టేలా ఉంది. ఏప్రిల్ 22న ఈ సినిమా విడుదల కానుంది.