NVSS Prabhakar: కేటీఆర్ టూర్‌పై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ ఆరోపణలు

nvss prabhakar allegations on ktr america tour

  • అమెరికా టూర్‌కు కేటీఆర్‌
  • ఇత‌ర దేశాల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకేన‌న్న ‌ప్రభాకర్ 
  • వాటిని బ‌హిర్గ‌తం చేస్తామ‌ని వ్యాఖ్య  

తెలంగాణ మంత్రి కేటీఆర్ మొద‌లుపెట్టిన అమెరికా ప‌ర్య‌ట‌న‌పై బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ పలు ఆరోపణలు చేశారు. కేటీఆర్ అమెరికా ప‌ర్య‌ట‌న రాష్ట్రానికి పెట్టుబ‌డులు తెచ్చేందుకు కాద‌ని చెప్పిన ఎన్వీఎస్ఎస్‌.. అమెరికాలో వారి పెట్టుబ‌డులు పెట్టుకునేందుకే కేటీఆర్ ఈ టూర్‌కు వెళ్లారేమోన‌న్న అనుమానం క‌లుగుతోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అలా టీఆర్ఎస్ నేత‌లు ఇత‌ర దేశాల్లో పెట్టే పెట్టుబ‌డుల‌ను త్వ‌ర‌లోనే బ‌హిర్గతం చేస్తామ‌ని కూడా ప్ర‌భాక‌ర్ తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, "కేటీఆర్ ఇప్పటికే పలు దేశాలు పర్యటించారు. భారీగా పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క పెట్టుబడి రాలేదు. సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానం వేసుకొని చైనా వెళ్లారు. వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేసీఆర్ చెప్పారు. ఆ సంగతి ఏమైంది?  వీళ్ళు పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్లడం లేదు. వేరే దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వెళుతున్నారేమోననే అనుమానం క‌లుగుతోంది. వాటిని త్వరలోనే బహిర్గతం చేస్తాం. రానున్న ఎన్నికల కోసం డబ్బులు దండుకోవడానికే 111 జీవోని రద్దు చేస్తున్నారు. మునిసిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ అసమర్థుడు. హైదరాబాద్ ను మురికి కూపంగా మార్చారు" అంటూ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిప‌డ్డారు.

  • Loading...

More Telugu News