Uttam Kumar Reddy: పాదయాత్రలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తెలంగాణ సర్కారుపై ఫైర్
- మీనాక్షి నటరాజన్ సర్వోదయ సంకల్ప పాదయాత్ర
- మెదక్ జిల్లా తూప్రాన్ చేరుకున్న మీనాక్షి
- అణగారిన వర్గాల భూముల కోసం పోరాటం చేస్తామన్న ఉత్తమ్
- ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా
కాంగ్రెస్ మధ్యప్రదేశ్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ చేపట్టిన సర్వోదయ సంకల్ప పాదయాత్ర మెదక్ జిల్లా చేరుకున్న విషయం తెలిసిందే. భూదాన్ ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో నిన్న మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నేడు కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తూప్రాన్ వద్ద ఈ పాదయాత్రలో పలువురు నేతలతో కలిసి పాల్గొని మాట్లాడారు.
తాము గిరిజన, అణగారిన వర్గాల భూముల కోసం పోరాటం చేస్తామని తెలిపారు. తెలంగాణలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చే వరకు పోరాడతామని చెప్పారు. రాష్ట్రంలో కోట్లాది రూపాయల ఉపాధి నిధుల కాంట్రాక్టులు అన్నీ టీఆర్ఎస్ కు చెందిన వారికే ప్రభుత్వం అప్పగిస్తోందని ఆయన ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.