Yash: తుపాన్ కి ఎదురెళ్లవద్దు .. 'కేజీఎఫ్ 2' నుంచి సాంగ్ రిలీజ్!

KGF 2 Movie Lyrical Song Released
  • యష్ నుంచి 'కేజీఎఫ్ 2'
  • పవర్ ఫుల్ పాత్రలో సంజయ్ దత్
  • దర్శకుడిగా ప్రశాంత్ నీల్  
  • ఏప్రిల్ 14న విడుదల 
ఈ ఏడాది థియేటర్లకు రానున్న భారీ సినిమాలలో 'కేజీఎఫ్ 2' ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యష్ కథానాయకుడిగా నటించగా, సంజయ్ దత్  ఒక కీలకమైన పాత్రను పోషించారు. 'ఇది చాలా పవర్ఫుల్ రోల్ .. సంజయ్ దత్ మాత్రమే చేయగలిగిన రోల్' అని ప్రశాంత్ నీల్ చెప్పిన దగ్గర నుంచి అందరిలో ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

కరోనా కారణంగా విడుదల తేదీని వాయిదా వేసుకుంటూ వచ్చిన సినిమాల్లో ఇది ఒకటి. ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన, ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషలకి సంబంధించిన లిరికల్ వీడియోను వదిలారు. 

'తుపాన్' అంటూ సాగే ఈ పాట. హీరో బిల్డప్ షాట్స్ పై కట్ చేశారు. "అతను మా జీవితాల్లోకి రాకముందు చావు మా మీద గంతులేసేది .. అతను వచ్చిన తరువాత చావు మీద మేము గంతులేస్తున్నాం. అతను తుపాన్ లాంటివాడు సార్ .. అతనికి ఎదురెళ్లడానికి ప్రయత్నిచవద్దు" అంటూ హీరో గురించి ఇంట్రడక్షన్ తో ఈ సాంగ్ మొదలవుతోంది.
Yash
Sanjay Dutt
Raveena
KGF2 Movie

More Telugu News