Qatar Airways: ఢిల్లీ-దోహా విమానానికి తప్పిన ప్రమాదం... పాకిస్థాన్ లో అత్యవసరంగా ల్యాండింగ్

Doha bound Qatar Airways plane from Delhi emergency landed in Karachi airport

  • ఢిల్లీ నుంచి దోహా బయల్దేరిన విమానం
  • విమానంలో వంద మందికి పైగా ప్రయాణికులు
  • టేకాఫ్ తర్వాత కార్గో విభాగంలో పొగలు
  • కరాచీ ఎయిర్ పోర్టు దిశగా విమానం మళ్లింపు

ఢిల్లీ నుంచి దోహా బయల్దేరిన ఓ విమానం పాకిస్థాన్ లో అత్యవసరంగా దిగాల్సి వచ్చింది. ఇది ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం. వంద మందికి పైగా ప్రయాణికులతో ఈ వేకువ జామున ఢిల్లీ నుంచి దోహా వెళ్లేందుకు టేకాఫ్ తీసుకుంది. అయితే, గాల్లోకి లేచిన కొద్దిసేపటి తర్వాత విమానం కార్గో విభాగంలో పొగలు వస్తున్నట్టు గుర్తించారు. దాంతో ఆ విమానాన్ని పాకిస్థాన్ లోని కరాచీ నగరం వైపు మళ్లించారు. కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. ప్రయాణికులను మరో విమానం ద్వారా దోహా పంపేందుకు ఖతార్ ఎయిర్ వేస్ ఏర్పాట్లు చేస్తోంది.

  • Loading...

More Telugu News