Petrol: ఐదు నెలల తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంత పెరిగిందంటే..!

Petrol and Diesel rated increased

  • హైదరాబాదులో లీటర్ పెట్రోల్ రూ. 109.10
  • విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 110.80
  • ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చిన పెరిగిన ధరలు  

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కొంతకాలం పాటు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికలు అయిపోవడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలకు రెక్కలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఈ ఉదయం 6 గంటల నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. 

తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు, డీజిల్ 87 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.10కి, లీటర్ డీజిల్ ధర రూ. 95.49కి చేరుకుంది.

ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ 88 పైసలు, డీజిల్ 83 పైసలు పెరిగింది. దీంలో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.80కి, డీజిల్ ధర రూ. 96.83కి చేరుకుంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.21కి, డీజిల్ రూ. 97.26కి చేరింది. రానున్న రోజుల్లో కూడా వీటి ధరలు పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.   

ఢిల్లీ, ముంబైలలో పెరిగిన ధరల వివరాలు: 

ఢిల్లీ: లీటర్ పెట్రోల్ రూ. 96.21, డీజిల్ రూ. 87.47. 
ముంబై: లీటర్ పెట్రోల్ రూ. 110.78, డీజిల్ రూ. 94.94.

  • Loading...

More Telugu News