Sensodyne: సెన్సోడైన్ టూత్ పేస్ట్ యాడ్ పై సీసీపీఏ అసంతృప్తి... భారీ జరిమానా

CCPA takes action on Sensodyne

  • రూ.10 లక్షల జరిమానా వడ్డించిన సీసీపీఏ
  • వారం రోజుల్లో యాడ్ నిలిపివేయాలని ఆదేశాలు
  • ప్రజలను తప్పుదోవ పట్టించడం సబబు కాదని వ్యాఖ్యలు

"ప్రపంచవ్యాప్తంగా డెంటిస్టులు సిఫారసు చేస్తున్న టూత్ పేస్ట్ సెన్సోడైన్... ప్రపంచపు నెంబర్ వన్ సెన్సిటివిటీ టూత్ పేస్ట్" అనే యాడ్ మనం టీవీలో చూస్తుంటాం. అయితే దీనిపై సీసీపీఏ (సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ) అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని, వారం రోజుల్లో యాడ్ ను నిలిపివేయాలని సెన్సోడైన్ తయారీదారును ఆదేశించింది. అంతేకాదు, రూ.10 లక్షల జరిమానా కూడా వడ్డించింది. 

సెన్సోడైన్ కు సంబంధించి టెలివిజన్ చానళ్లలోనూ, వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ వస్తున్న వాణిజ్య ప్రకటనలను సీసీపీఏ సుమోటోగా స్వీకరించింది. ఏ ఆధారాలతో ప్రపంచవ్యాప్తంగా డెంటిస్టులు ఈ పేస్ట్ ను సిఫారసు చేస్తున్నారో సెన్సోడైన్ సంస్థ తమకు వివరాలు సమర్పించలేదని సీసీపీఏ తెలిపింది. మనదేశంలో దంతవైద్యుల నుంచి అభిప్రాయాలు తీసుకుని, ప్రపంచమంతా వైద్యులు సిఫారసు చేస్తున్నారంటూ ప్రచారం చేసుకోవడం సబబు కాదని సెన్సోడైన్ యాజమాన్యానికి హితవు పలికింది.

  • Loading...

More Telugu News