COVID19: కరోనా డైలీ కేసులు మళ్లీ పెరిగాయ్

Covid Daily Cases On Rising trend
  • నిన్న 1,778 మందికి కరోనా పాజిటివ్
  • అంతకుముందు రోజుతో పోలిస్తే 197 కేసులు ఎక్కువ
  • 62 మంది మహమ్మారికి బలి
  • తగ్గుతున్న యాక్టివ్ కేసులు
కరోనా రోజువారీ కేసులు పెరిగాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే నిన్న 197 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మొన్న 1,581 మంది కరోనా బారిన పడితే.. నిన్న 1,778 మందికి పాజిటివ్ గా తేలింది. తాజా కేసులతో కలిపి మొత్తంగా 4,30,12,749కి పెరిగాయి. యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా మరో 826 యాక్టివ్ కేసులు తగ్గాయి. ప్రస్తుతం 23,087 మంది ఇంకా కరోనాతో బాధపడుతున్నారు. 

ఇప్పటిదాకా కరోనా బారి నుంచి 4,24,73,057 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.57గా ఉంది. మరో 62 మంది కరోనాకు బలవగా.. మొత్తం మరణాల సంఖ్య 5,16,605కి చేరింది. కాగా, డైలీ పాజిటివిటీ రేటు 0.26 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 0.36 శాతంగా నమోదైంది. ఇక, 184,03,90,980 డోసుల కరోనా వ్యాక్సిన్ ను వినియోగించారు. రాష్ట్రాల వద్ద ఇంకా 16,97,30,191 వ్యాక్సిన్ డోసులున్నాయి.
COVID19
Corona Virus
Omicron

More Telugu News