AB Venkateswara Rao: సీఎస్‌కు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ
- తనను సస్పెన్షన్‌లో కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని లేఖ
- సస్పెన్షన్ రెండేళ్లు పూర్తయినందున అది తొలగిపోయినట్లేనని వ్యాఖ్య
- సస్పెన్షన్‌కు ఆరేసి నెలల చొప్పున పొడిగింపు జనవరి 27నే ముగిసిందని వాదన
తనపై కొనసాగుతున్న సస్పెన్షన్‌పై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తనను సస్పెన్షన్‌లో కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన తెలిపారు. సస్పెన్షన్ రెండేళ్లు పూర్తయినందున అది తొలగిపోయినట్లేనని లేఖలో ఆయన పేర్కొన్నారు.
తనపై సస్పెన్షన్‌ను ఆరేసి నెలల చొప్పున పొడిగిస్తూ వచ్చారని, దీంతో మొత్తం కలిపి రెండేళ్ల సస్పెన్షన్ గడువు జనవరి 27నే ముగిసిందని వివరించారు. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌కు కేంద్ర హోం శాఖ అనుమతి తప్పనిసరి అని, గడువు లోపు ఆ అనుమతి తీసుకోనందున ఇక అది ముగిసినట్టేనని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి సస్పెన్షన్ ఇక తొలగినందున నిబంధనల ప్రకారం తనకు పూర్తి జీతం ఇవ్వాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.