Ukraine: రష్యాను అడ్డుకోవడానికి రోజుకు 1,000 క్షిపణులు అవసరం: అమెరికాను కోరిన ఉక్రెయిన్

Ukraine tells USA that they need 1000 missiles per day

  • ప్రతి రోజు 500 జావెలిన్ క్షిపణులు, 500 స్టింగర్ క్షిపణులు అవసరమన్న ఉక్రెయిన్
  • ఆయుధ సాయాన్ని పెంచాలని పశ్చిమ దేశాలను కోరుతున్న ఉక్రెయిన్
  • నిరంతరాయంగా ఆయుధ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్న అమెరికా

ఉక్రెయిన్ పై రష్యా దాడి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. నగరాలన్నీ ధ్వంసమవుతున్నాయి. అయినప్పటికీ రష్యా దాడులను ఉక్రెయిన్ సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యాను ఎదుర్కోవడానికి తమకు రోజుకు 1,000 క్షిపణులు అవసరమని అమెరికాకు ఉక్రెయిన్ తెలిపింది. అమెరికాకు చెందిన జావెలిన్ క్షిపణలు 500, స్టింగర్ క్షిపణులు 500 ప్రతి రోజు అవసరమవుతాయని చెప్పింది. 

మరోవైపు ఉక్రెయిన్ కు ఆయుధాల కొరత ఏర్పడుతోంది. దీంతో, సాయాన్ని పెంచాలని పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ కోరుతోంది. అమెరికా, నాటో దేశాలు మార్చి 7వ తేదీ నాటికి దాదాపు 17 వేల యాంటీ ట్యాంక్ క్షిపణులు, 2 వేల యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులను ఉక్రెయిన్ కు అందజేశాయి. ఉక్రెయిన్ కు నిరంతరాయంగా ఆయుధ సరఫరా జరిగేలా అమెరికా చర్యలు తీసుకుంటోంది. అంతేకాదు.. ఆర్థిక పరంగా కూడా బిలియన్ డాలర్లకు పైగా ప్యాకేజీలను ఇవ్వడం ప్రారంభించింది.

  • Loading...

More Telugu News