Notification: మరో వారం రోజుల్లో ఏపీలో కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్

Final notification on new districts in AP will be out in a week
  • ఏపీలో 13 కొత్త జిల్లాల ఏర్పాటు
  • అభ్యంతరాలు స్వీకరించిన ప్రభుత్వం
  • తుది నోటిఫికేషన్ లో అన్ని అంశాలపై స్పష్టత
  • ఉగాది (ఏప్రిల్ 2) నాడు కొత్త జిల్లాల ప్రారంభం
ఏపీలో ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభం కానుంది. ఉగాది రోజున సీఎం జగన్ 13 కొత్త జిల్లాల్లో పరిపాలనను ప్రారంభించనున్నారు. కాగా, కొత్త జిల్లాలపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం... మరో వారం రోజుల్లో తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మార్చి 31న నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. దీని ప్రకారమే ఏ ప్రాంతం ఏ జిల్లాలో ఉంటుందన్నది నిర్ధారణ కానుంది. 

పలు జిల్లాలు, ప్రాంతాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల మార్పునకు సంబంధించి ప్రభుత్వానికి కొన్ని వందల అభ్యంతరాలు అందినట్టు తెలుస్తోంది. అభ్యంతరాలు వ్యక్తం చేసినవారిలో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాల పరిధిపై స్పష్టమైన రూపు వచ్చినట్టు సమాచారం. 

ప్రస్తుతం జిల్లా పోలీసు శాఖలో విభజన, రెవెన్యూ ఉద్యోగుల విభజన ప్రక్రియ జరుగుతోంది. కాగా, కొత్త జిల్లాలకు సంబంధించి అధికారుల కార్యాలయాలను గుర్తించిన ప్రభుత్వం.... ప్రాథమికంగా ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్, ఒక జాయింట్ కలెక్టర్, ఒక ఎస్పీని నియమించనుంది.
Notification
New Districts
Andhra Pradesh
Ugadi

More Telugu News