Narendra Modi: భార‌తీయులు గర్వించే విధంగా ఒక ఘనతను సాధించాం: మ‌న్ కీ బాత్‌లో మోదీ

modi praises indians

  • భార‌త్ నుంచి విదేశాల‌కు ఎగుమ‌తులు పెరిగాయి
  • 400 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించాం
  • గ‌తంలో ఎగుమతుల విలువ‌ 100 బిలియన్ డాల‌ర్లు

భార‌త్ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మ‌న్ కీ బాత్‌లో మాట్లాడారు. భార‌త్ నుంచి విదేశాల‌కు ఎగుమ‌తులు పెరిగాయ‌న్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌స్తావించారు. ఇటీవ‌ల భార‌తీయులు గర్వించే విధంగా ఒక ఘనతను సాధించామని ఆయ‌న అన్నారు. భారతదేశం 400 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని (30 లక్షల కోట్ల రూపాయల) సాధించిందని ఆయ‌న చెప్పారు. 

గ‌తంలో ఎగుమతుల విలువ‌ 100 బిలియన్ డాల‌ర్లు, కొన్నిసార్లు 150 బిలియన్ డాల‌ర్లు, కొన్నిసార్లు 200 బిలియన్ డాల‌ర్లు ఉండేవ‌ని ఆయ‌న చెప్పారు. ఇప్పుడు మాత్రం ఏకంగా 400 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఆయ‌న గుర్తు చేశారు. భారత్ లో తయారయ్యే వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని దీని ద్వారా తెలుస్తోందని ఆయ‌న అన్నారు. మ‌న‌ సంకల్పాలు, ప్రయత్నాలు మ‌నం క‌నే కలల కంటే గొప్ప‌గా ఉంటే విజయం త‌ప్ప‌క వ‌రిస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News