Banks: ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవుల జాతర.. జాబితా ఇదిగో
- తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల పాటు బ్యాంకుల మూత
- దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవు
- సెలవుల్లో అందుబాటులోనే ఆన్‌లైన్ బ్యాంకింగ్
బ్యాంకులకు ఒకటో, రెండు రోజులో సెలవు అయితే ఫరవా లేదు గానీ.. ఏకంగా ఒక నెలలోనే సగం రోజులు బ్యాంకులకు సెలవు వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఏప్రిల్ మాసంలో రానుంది. ఏప్రిల్ నెలలో బ్యాంకులకు ఏకంగా 15 రోజుల పాటు సెలవు రానుంది.
దేశంలో పలు రాష్ట్రాలను బట్టి ఈ సెలవుల సంఖ్యలో కాస్తంత మార్పు ఉన్నా.. బ్యాంకులకు ఎక్కువ రోజులు సెలవు మాత్రం ఖాయమే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఏకంగా 11 రోజుల పాటు ఏప్రిల్ నెలలో బ్యాంకులు మూత పడనున్నాయి. సెలవు రోజుల్లోనూ ఆన్ లైన్ బ్యాంకింగ్ అందుబాటులో ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవే..
ఏప్రిల్ 1- ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అకౌంట్స్ క్లోజింగ్ డే.
ఏప్రిల్ 2- ఉగాది (తెలుగు నూతన సంవత్సరం)
ఏప్రిల్ 3- ఆదివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 9- రెండో శనివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 10- ఆదివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 14- డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి
ఏప్రిల్ 15- గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 17- ఆదివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 23- నాలుగో శనివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 24- ఆదివారం(సాధారణ సెలవు)