Jr NTR: రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై జూనియ‌ర్ ఎన్టీఆర్ తాజా మాట ఇదే!

jr ntr comments on political entry

  • యాక్టింగ్‌లోనే ఉండాల‌నుకుంటున్నాన‌ని వెల్ల‌డి
  • జీవితంలో సంతోషక‌ర‌మైన ద‌శ‌లో ఉన్నాన‌ని వ్యాఖ్య‌
  • భ‌విష్య‌త్ అంటే త‌రువాతి సెక‌న్ ఏమిట‌నేదే నా భావ‌న‌
  • పొలిటిక‌ల్ ఎంట్రీపై సంధించిన ప్ర‌శ్న‌కు తార‌క్ స‌మాధానం

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై తాజాగా త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. టీడీపీకి చెందిన ప‌లువురు కార్య‌క‌ర్త‌లు ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల్సిందేనంటూ త‌ర‌చూ వినిపించే డిమాండ్ల నేప‌థ్యంలో దానిపై తార‌క్ తాజాగా చెప్పిన మాట ప్రాధాన్యం సంత‌రించుకుంది. తాను రాజ‌కీయాల్లోకి రావాల‌నుకోవ‌డం లేద‌న్న భావ‌న వినిపించేలా తార‌క్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

త‌న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రమోష‌న్స్‌లో భాగంగా ఇటీవ‌లే ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తార‌క్ ఈ అంశంపై కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. ఈ సంద‌ర్భంగా తార‌క్ ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే.. “నేను ప్రస్తుతం నా జీవితంలో చాలా చాలా సంతోషకరమైన దశలో ఉన్నాను. ఒక యాక్టర్ గా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను. నేను మొదట నుంచి దానికే కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. ఫ్యూచర్ అంటే ఐదేళ్లు తర్వాత, పదేళ్ల తరువాత ఉంది అని అనుకొనే మనిషిని కాను.. భవిష్యత్ అంటే నా నెక్స్ట్ సెకన్ ఏంటి అనేది ఆలోచించే మనిషిని. ప్రస్తుతం ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నాను. యాక్టింగ్ అనేది నాకు ఎనలేని సంతృప్తినిచ్చే పనిగా ఉంది. నేను అందులోనే ఉండాలనుకుంటున్నాను” అని తార‌క్‌ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News