Sri Lanka: శ్రీలంకలో తీవ్ర అశాంతి.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స

Sri Lanka Declares State Of Emergency

  • ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక
  • రాజపక్స తప్పుకోవాలంటూ అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన ప్రజలు
  • పలు హింసాత్మక ఘటనలు
  • అత్యయిక పరిస్థితి విధిస్తూ గెజిట్ జారీ చేసిన రాజపక్స 

శ్రీలంకలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చి అశాంతి నెలకొన్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. నిన్నటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న దారుణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల భద్రత, అత్యవసర సేవలు, నిత్యావసరాల సరఫరా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గెజిట్ జారీ చేశారు.

గత కొన్ని రోజులుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఆకాశాన్ని అంటుతున్న ధరలు, ఆహార పదార్థాల కొరత, విద్యుత్ కోతలు, ఇంధన కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన వేలాదిమంది ప్రజలను రాజపక్స తప్పుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి తోడు పలు హింసాత్మక ఘటనలు కూడా చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు రాజపక్స అత్యయిక స్థితిని ప్రకటించారు.

  • Loading...

More Telugu News