Andhra Pradesh: కొనసాగుతున్న పెట్రో వడ్డన.. ఏపీలో రూ. 120, తెలంగాణలో రూ. 118 దాటిన పెట్రోలు ధర
- లీటరు పెట్రోలుపై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసల పెంపు
- 15 రోజుల్లో రూ.9.20 పెరిగిన పెట్రో ధరలు
- ముంబైలో రూ. 119 దాటిన పెట్రోలు
దేశంలో పెట్రో వడ్డన కొనసాగుతోంది. నేడు పెట్రోలుపై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రో ధరలు గత 15 రోజుల్లో 13 సార్లు పెరగడం గమనార్హం. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 118.59కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 104.62కి ఎగబాకింది.
ఆంధ్రప్రదేశ్‌లో లీటరు పెట్రోలుపై 88 పైసలు, డిజిల్‌పై 84 పైసలు పెరిగింది. దీంతో విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ. 120.18కి చేరుకుంది. డీజిల్ ధర రూ. 105.84కు పెరిగింది. అలాగే, గుంటూరులో లీటరు పెట్రోలు ధర రూ. 120.38, డీజిల్ ధర రూ. 106.04గా ఉంది. ముంబైలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రూ. 119.67, రూ. 103.92గా ఉన్నాయి. దాదాపు నాలుగున్నర నెలలపాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలు ఈ 15 రోజుల్లో ఏకంగా రూ. 9.20 పెరగడం గమనార్హం.