Naga Chaitanya: చైతూ 22వ సినిమా నుంచి అధికారిక ప్రకటన!

Naga Chaitanya in Venkat Prabhu movie
  • 'బంగార్రాజు'తో హిట్ కొట్టిన చైతూ 
  • రిలీజ్ కి రెడీగా 'థ్యాంక్యూ'
  • సెట్స్ పైకి 22వ సినిమా
  •  దర్శకుడిగా వెంకట్ ప్రభు
నాగచైతన్య నుంచి ఇటీవల వచ్చిన 'బంగార్రాజు' భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి 'థ్యాంక్యూ' రానుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయికగా రాశి ఖన్నా అలరించనుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబవుతోంది.

ఈ సినిమా తరువాత చైతూ .. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒక సినిమా రూపొందించనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ కాంబినేషన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కెరియర్ పరంగా చైతూకి ఇది 22వ సినిమా. 

తమిళంలో దర్శకుడిగా వెంకట్ ప్రభుకి మంచి పేరు ఉంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు తెరపైకి వచ్చింది. అయితే అధికారికంగా చెప్పవలసి  ఉంది. తెలుగులో పూజ హెగ్డే తన ఫస్టు సినిమానే చైతూతో చేసిన సంగతి తెలిసిందే.
Naga Chaitanya
Srinivasa Chittoorii
Venkat Prabhu Movie

More Telugu News