Congress: రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. గృహ నిర్బంధం

TPCC Chief Revanth Reddy House Arrest

  • విద్యుత్ చార్జీలు తగ్గించాలని, ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్
  • నేడు విద్యుత్ సౌధ, సివిల్ సప్లైస్ భవనాల ముట్టడికి పిలుపు
  • మరికొందరు నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

విద్యుత్ చార్జీల పెంపు, ధాన్యం కొనుగోలు పోరాటంలో భాగంగా నేడు విద్యుత్ సౌధ, సివిల్ సప్లైస్ భవనాల ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడ పోలీసులు మోహరించారు. అలాగే, మరికొందరు నాయకులను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు.

  • Loading...

More Telugu News