India: భారత్ లో మరింతగా తగ్గిన కరోనా కేసులు.. కలవరపెడుతున్న ఎక్స్ఈ వేరియంట్!
- గత 24 గంటల్లో 1,033 కరోనా కేసులు
- దేశ వ్యాప్తంగా 43 మంది మృతి
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,639
భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడిలోనే ఉంది. గత 24 గంటల్లో 4.8 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,033 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందు రోజు కంటే ఈ సంఖ్య కొంచెం తక్కువ కావడం గమనార్హం. ఇదే సమయంలో కరోనా నుంచి 1,222 కోలుకోగా, 43 మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 11,639 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక ఇప్పటి వరకు 4.3 కోట్ల మంది కరోనా బారిన పడగా... 4,24,98,789 మంది కోలుకున్నారు. మొత్తం 5,21,530 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ఈ కలవరపెడుతోంది. ముంబైలో ఈ వేరియంట్ కు సంబంధించి తొలి కేసు నమోదయినట్టు తెలుస్తోంది.