Anand Mahindra: మౌంట్ ఎవరెస్ట్ పై నుంచి చుట్టూ 360 డిగ్రీల కోణంలో చూడాలని ఉందా..?.. ఇదిగో వీడియో

Anand Mahindra posts video showing 360 degree view from top of Mount Everest
  • ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా
  • నిర్ణయాలు తీసుకునే విషయంలో సాయపడుతుంది
  • ఎవరెస్ట్ పై ఉన్నామని భావించి విశాలంగా చూడొచ్చంటూ ట్వీట్
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ అయిన ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ఖాతాను ఫాలో అయితే చాలు. అరుదైన, ఆకర్షణీయమైన, ఆలోచింపచేసే అంశాలను తెలుసుకోవచ్చు. ఇలాంటివి తరచుగా ఆయన పది మందితో షేర్ చేసుకుంటూ ఉంటారు.  తాజాగా మౌంట్ ఎవరెస్ట్ కు సంబంధించి వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు. మరొకరు పోస్ట్ చేసిన వీడియోను ఆయన రీపోస్ట్ చేశారు.

‘‘మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై నుంచి 360 డిగ్రీల కోణంలో చూపించేది. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. నీవు ఎవరెస్ట్ శిఖరంపై ఉన్నావని ఊహించుకుని, ప్రపంచాన్ని విశాలంగా చూసేందుకు ఇది సాయపడుతుంది. పెద్ద అంశాన్ని సులభంగా చూడొచ్చు’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 

తన ట్వీట్స్ తో సానుకూల ఆలోచనలను, భావాలను పెంచే ప్రయత్నం కూడా ఆనంద్ మహీంద్రా చేస్తుంటారు. ఆయన పెట్టే ట్వీట్స్ కొన్ని సందర్భాల్లో ఎంతో మందిని ఆలోచింపజేస్తుంటాయి. మానవత్వానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు.
Anand Mahindra
Mount Everest
360 degree view
vedio post
twitter

More Telugu News