AP Cabinet: కొత్తపేటతో పాటు పులివెందుల కూడా రెవెన్యూ డివిజనే.. ఏపీ కేబినెట్ నిర్ణయం
- జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ
- మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లకు గ్రీన్ సిగ్నల్
- వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి ఆమోదం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో గురువారం మధ్యాహ్నం మొదలైన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. ఇప్పటికే 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా 72 రెవెన్యూ డివిజన్లను కూడా ప్రకటించింది. తాజాగా మరో రెండు రెవెన్యూ డివిజన్లకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటిలో కోనసీమ జిల్లాలోని కొత్తపేట ఓ డివిజన్ కాగా... జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మరో కొత్త డివిజన్‌గా ఏర్పడింది.
ఇక వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి కూడా జగన్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిల్లెట్ మిషన్ ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పంచాయతీరాజ్ చట్టసవరణను కేబినెట్ ఆమోదించింది. హెల్త్ హబ్ పథకం కింద ఐదు జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆసుపత్రుల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.