Pakistan: పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌కు షాక్‌.. అవిశ్వాసంపై ఓటింగ్ త‌ప్ప‌ద‌న్న సుప్రీంకోర్టు

pak supreme court verdict on no confidence motion on  imran khan government

  • అవిశ్వాస తీర్మానాన్ని ఇమ్రాన్ ఎదుర్కోవాల్సిందే
  • తీర్మానంపై ఓటింగ్‌ను ర‌ద్దు చేయ‌డం కుద‌ర‌దు 
  • జాతీయ అసెంబ్లీని పున‌రుద్ధ‌రించాలి
  • ఈ నెల 9న తీర్మానంపై ఓటింగ్ నిర్వ‌హించాలి
  • పాక్ సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

పాకిస్థాన్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు గురువారం గ‌ట్టి షాకే త‌గిలింది. ఇమ్రాన్ స‌ర్కారుపై విప‌క్షాలు ప్ర‌తిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జ‌రిగి తీరాల్సిందేన‌ని తీర్పు చెప్పింది. అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 9న ఓటింగ్‌ను నిర్వ‌హించాల‌ని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు గురువారం సాయంత్రం పాక్ సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

పాకిస్థాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వంపై విప‌క్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌తిపాదించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇమ్రాన్ పార్టీకి చెందిన కొంద‌రితో పాటు ఆయ‌న‌కు మ‌ద్దతు ఇస్తున్న మిత్ర‌ప‌క్షాల‌కు చెందిన కొంద‌రు విప‌క్షంతో చేరిపోయారు. దీంతో త‌మ ప్ర‌భుత్వ మ‌నుగ‌డ కోసం ఓ స‌రికొత్త వ్యూహాన్ని అమ‌లు చేసిన ఇమ్రాన్... పాక్ జాతీయ అసెంబ్లీలో డిప్యూటీ స్పీక‌ర్‌తో ఓ ప్ర‌క‌టన చేయించారు.

ఇమ్రాన్ వ్యూహం మేర‌కు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను ర‌ద్దు చేసిన డిప్యూటీ స్పీక‌ర్..ఏకంగా జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేశారు. ఈ ప‌రిణామంపై విప‌క్షాలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి. ఈ పిటిష‌న్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను ఎదుర్కోవాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. ఇందుకోసం జాతీయ అసెంబ్లీని పున‌రుద్ధ‌రించాల‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ స్పీక‌ర్ అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చ‌డం స‌రికాద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

  • Loading...

More Telugu News