Telangana: 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
- పరీక్షా సమయాన్ని పెంచిన ప్రభుత్వం
- 2.45 గంటల నుంచి 3.15 గంటలకు పెంపు
- ఛాయిస్ కూడా ఎక్కువగా ఉంటుందన్న మంత్రి సబిత
తెలంగాణలో వచ్చే నెలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. గత రెండేళ్లుగా విద్యార్థులు కరోనా కారణంగా చాలా కోల్పోయారు. ఆన్ లైన్ తరగతులు కూడా విద్యార్థులకు చాలా ఇబ్బందులను తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటూ వస్తోంది.
తాజాగా 10వ తరగతి విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షా సమయాన్ని మరో 30 నిమిషాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2 గంటల 45 నిమిషాలు ఉన్న పరీక్షా సమయాన్ని... 3 గంటల 15 నిమిషాలకు పెంచింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 70 శాతం సిలబస్ నే అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఛాయిన్ కూడా ఎక్కువ ఇస్తున్నట్టు తెలిపారు. 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.