NCP: శరద్ పవార్ ఇంటిపై దాడి... రాళ్లు, చెప్పులు విసిరేసిన ఎంఎస్ఆర్టీసీ కార్మికులు
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్
- నాలుగైదు నెలలుగా కొనసాగుతున్న రిలే దీక్షలు
- శుక్రవారం ఉన్నట్టుండి పవార్ ఇంటిపై దాడికి యత్నం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ ఇంటిపై శుక్రవారం దాడి జరిగింది. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ)కి చెందిన ఉద్యోగులు ఈ దాడికి దిగారు. తమను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ గడచిన నాలుగైదు నెలలుగా ఆర్టీసీ ఉద్యోగులు రిలే దీక్షలు చేస్తున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఉన్నట్టుండి ఆర్టీసీ ఉద్యోగులు పవార్ ఇంటిపైకి దూసుకువచ్చారు. పవార్ ఇంటి గేటును తోసుకుని మరీ ఆయన ఇంటి ఆవరణలోకి వెళ్లిన ఉద్యోగులు రాళ్లతో దాడికి దిగారు. వారిని వారించేందుకు పోలీసులు, పవార్ ఇంటి సిబ్బంది యత్నిస్తున్నా.. ఉద్యోగులు తమ కాళ్లకు ఉన్న చెప్పులను కూడా తీసుకుని పవార్ ఇంటిపైకి విసిరారు. ఈ దృశ్యాలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.