Telangana: కృష్ణా జలాల్లో మా వాటా తేల్చండి... కేంద్రానికి తెలంగాణ లేఖ
- తక్షణమే ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేయండి
- కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలకు సమానంగా వాటా ఇవ్వాల్సిందే
- కేంద్రానికి లేఖలో తెలంగాణ డిమాండ్
తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు శుక్రవారం ఓ లేఖ రాసింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శిని అడ్రెస్ చేస్తూ రాసిన సదరు లేఖలో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రెండు కీలక అంశాలను ప్రస్తావించారు. కృష్ణా జలాల్లో తమ వాటాను తేల్చాలని కోరిన తెలంగాణ.. అందుకోసం తక్షణమే ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరింది.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో గంపగుత్తగా నీటి కేటాయింపులు జరిగాయని, అదే రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై స్పష్టమైన ఆదేశాలు ఏమీ లేవని పేర్కొన్న తెలంగాణ.. పెరిగిన ఆయకట్టు, తాగు నీటి అవసరాల నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు చెరి సగం మేర కృష్ణా జలాలను కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని తేల్చేందుకే తక్షణమే ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.