Malaika Arora: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి స్పందించిన మలైకా!

Malaika Arora first response after accident
  • ముంబై - పూణె ఎక్స్ ప్రెస్ హైవేపై యాక్సిడెంట్
  • సినిమాలో జరిగినట్టు జరిగిపోయిందన్న మలైకా
  • తన చుట్టూ ఉన్నవారు సాయం చేశారని వ్యాఖ్య
బాలీవుడ్ భామ మలైకా అరోరా ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ముంబై - పూణే ఎక్స్ ప్రెస్ హైవే మీద పన్వేల్ సమీపంలో ఆమె వాహనం యాక్సిదెంట్ కు గురైంది. యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ఆమె స్పందించింది. 

తనకు యాక్సిడెంట్ అయిన ఘటన ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని తెలిపింది. ఏదో సినిమాలో జరిగిపోయినట్టుగా జరిగిందని చెప్పింది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే తనతో పాటు ఉన్నవారు, తన చుట్టూ ఉన్నవారు సాయం చేశారని, తనను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారని తెలిపింది. స్నేహితులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు తనపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలని చెప్పింది. ఈ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది.
Malaika Arora
Accident
Bollywood

More Telugu News