SRH: చెన్నైని కట్టడి చేసిన సన్ రైజర్స్ బౌలర్లు... బ్యాటర్లు ఏంచేస్తారో..?
- టాస్ గెలిచిన సన్ రైజర్స్
- బ్యాటింగ్ కు దిగిన చెన్నై
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 రన్స్
- 48 పరుగులు చేసిన మొయిన్ అలీ
- రెండేసి వికెట్లు తీసిన సుందర్, నటరాజన్
వరుసగా రెండు మ్యాచ్ లలో ఓటమిపాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగింది. అందుకు తగ్గట్టుగానే సన్ రైజర్స్ బౌలర్లు సరైన ప్రదేశాల్లో బంతులు సంధించి చెన్నై బ్యాటింగ్ లైనప్ ను అద్భుతంగా కట్టడి చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేసింది.
మొయిన్ అలీ 48 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంబటి రాయుడు 27, కెప్టెన్ రవీంద్ర జడేజా 23 పరుగులు చేశారు. మాజీ కెప్టెన్ ధోనీ 3 పరుగులు చేసి ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న మార్కో జాన్సెన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. సన్ రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, నటరాజన్ 2, జాన్సెన్ 1, భువనేశ్వర్ కుమార్ 1, ఐడెన్ మార్ క్రమ్ 1 వికెట్ తీశారు.