Chevireddy Bhaskar Reddy: తుడా చైర్మన్ గా మళ్లీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే... మంత్రి పదవి ఆశలు గల్లంతు!
- ఏపీలో కొత్త మంత్రివర్గం
- ఈ నెల 11న నూతన క్యాబినెట్ ప్రమాణస్వీకారం
- రేసులో చెవిరెడ్డి ఉన్నట్టు ప్రచారం
- ప్రచారానికి ముగింపు పలికిన ప్రభుత్వం
- మరో రెండేళ్లు తుడా చైర్మన్ గా చెవిరెడ్డి
ఏపీలో నూతన మంత్రివర్గం ఈ నెల 11న కొలువుదీరనుండగా, క్యాబినెట్ ఆశావహుల జాబితాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే, నూతన మంత్రివర్గ ప్రకటనకు ముందే ఈ ప్రచారానికి ఏపీ ప్రభుత్వం ముగింపు పలికింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరోసారి తుడా చైర్మన్ గా నియమిస్తున్నట్టు వెల్లడించింది. తుడా చైర్మన్ గా ఆయన పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. ఈ నెల 12 నుంచి తాజా నియామకం వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది.