Andhra Pradesh: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు 24 పేజీల జవాబు పత్రం.. అదనపు పత్రాలకు సెలవ్!

24 page answer sheet for ap inter students

  • మార్గదర్శకాలు విడుదల చేసిన ఇంటర్ విద్యామండలి
  • ఉదయం 8.45 గంటల తర్వాత పరీక్ష హాలులోకి నో ఎంట్రీ
  • 9.45 గంటల వరకు వాష్ రూమ్స్‌కు వెళ్లేందుకు కూడా అనుమతి నిల్

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈసారి 24 పేజీల జవాబు పత్రాన్ని ఇవ్వనున్నారు. విద్యార్థులు ఇందులోనే జవాబులు రాయాల్సి ఉంటుంది. జవాబులు రాసేందుకు అదనంగా ఎలాంటి పత్రాలు ఇవ్వరని ఇంటర్ విద్యామండలి పేర్కొంది. ఈ మేరకు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. 

ప్రశ్నపత్రాల కోడింగ్‌కు సంబంధించి ఏ రోజుకారోజు కోడ్ నంబర్ల సమాచారాన్ని బోర్డు నుంచి పంపిస్తారు. ఉదయం 8.45 గంటల తర్వాత విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. అలాగే, 9.45 గంటల వరకు వాష్ రూమ్స్‌కు వెళ్లేందుకు కూడా అనుమతి లేదు. మొబైల్ ఫోన్లు సహా ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లేందుకు అనుమతించరు.

  • Loading...

More Telugu News