Google: యూజర్ల డేటాను రహస్యంగా కొట్టేస్తున్న యాప్స్.. నిషేధించిన గూగుల్
- పదుల సంఖ్యలో యాప్స్ పై వేటు
- ప్లే స్టోర్ నుంచి తొలగింపు
- ఫోన్ నంబర్లు, పాస్ వర్డ్ ల చోరీ
ఎన్నో ఆకర్షణలతో యూజర్ల ఫోన్లలోకి చేరుతున్న మొబైల్ అప్లికేషన్లు (యాప్స్) కీలకమైన డేటాను చోరీ చేస్తున్నాయి. ఈ విషయం గూగుల్ స్వయంగా కనుగొంది. యూజర్ల ఫోన్ నుంచి ఫోన్ నంబర్లు, ఇతర కీలకమైన సమాచారాన్ని చోరీ చేస్తున్న డజన్ల సంఖ్యలో యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి నిషేధించినట్టు ప్రకటించింది. వీటిని ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు తెలిపింది.
నిషేధించిన వాటిల్లో ముస్లిం ప్రేయర్ యాప్ లు కూడా ఉన్నాయి. కోటి కంటే ఎక్కువ సార్లు యూజర్లు ఈ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. బార్ కోడ్ యాప్, హైవే స్పీడ్ ట్రాప్ డిటెక్షన్ యాప్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ యాప్ కూడా వీటిల్లో ఉన్నాయి. లొకేషన్ సమాచారం, ఈ మెయిల్, ఫోన్ నంబర్లు, సమీపంలోని డివైజ్ లు పాస్ వర్డ్ లను నిషేధిత యాప్స్ తీసుకునే ప్రయత్నం చేసినట్టు గూగుల్ ప్రకటించింది.