bhadrachalam: రాములోరి క‌ల్యాణం తిల‌కించేందుకు భారీగా భ‌ద్రాచ‌లానికి త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు

srirama navami in bhadrachalam

  • భద్రాచలంలో మూలమూర్తులకు ఏకాంతంగా తిరుకల్యాణం 
  • మిథిలా స్టేడియానికి ఉత్సవమూర్తులు
  • పట్టు వ‌స్త్రాలు తీసుకువ‌చ్చిన తెలంగాణ మంత్రులు

శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా భద్రాచలంలో మూలమూర్తులకు ఏకాంతంగా తిరుకల్యాణం జరిపిస్తున్నారు. ఆ త‌ర్వాత మిథిలా స్టేడియానికి ఉత్సవమూర్తులను తీసుకురానున్నారు. అనంత‌రం పుణ్యాహవచనం, విష్వ‌క్సేన ఆరాధన, యోత్ర ధారణ, కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు ఉంటాయి. 

                         
సీతారాముల కల్యాణోత్సవం సంద‌ర్భంగా తెలంగాణ‌ మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్, పువ్వాడ అజ‌య్ కుమార్ పట్టు వ‌స్త్రాలు తీసుకువ‌చ్చారు. క‌రోనా ప్ర‌భావం తగ్గ‌డంతో  రాములోరి క‌ల్యాణం తిల‌కించేందుకు భారీగా భ‌ద్రాచ‌లానికి భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. 

రేపు శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం ఉంటుంది. భద్రాచలంలో 1,400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, శ్రీ‌రామన‌వ‌మి సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆల‌యాల వ‌ద్ద ర‌ద్దీ నెల‌కొంది. 

     

         

  • Loading...

More Telugu News