Telangana: టీఆర్ఎస్‌కు షాక్‌!.. ఒక్క గింజ కూడా కొనడం లేదంటూ కేంద్రం ప్ర‌క‌ట‌న‌!

union government statement on grain purchase in telangana

  • ఏ రాష్ట్రం నుంచి పారాబాయిల్డ్ రైస్ కొన‌డం లేదన్నా కేంద్రం 
  • పంజాబ్ నుంచి ఒక్క గింజ కూడా కొనలేదని వివరణ 
  • ఎఫ్‌సీఐ నేరుగా ధాన్యం సేక‌రించ‌దని వ్యాఖ్య 
  • ఏపీలో రాని స‌మ‌స్య తెలంగాణ‌లో ఎందుకు వ‌స్తోంద‌న్న కేంద్రం

తెలంగాణ‌లో యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ చేప‌ట్టిన నిర‌స‌న‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం స్పందించింది. దేశంలోని ఏ ఒక్క రాష్ట్రం నుంచి కూడా పారాబాయిల్డ్ రైస్‌ను కొన‌డం లేద‌ని తేల్చి చెప్పిన కేంద్రం.. అందులో భాగంగానే పంజాబ్ నుంచి కూడా ఒక్క గింజ కూడా పారాబాయిల్డ్ రైస్‌ను కొన‌లేద‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కేంద్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ కార్య‌ద‌ర్శి సుధాంశు పాండే కాసేప‌టి క్రితం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 

ఈ సంద‌ర్భంగా సుధాంశు పాండే మాట్లాడుతూ.. "ప్ర‌స్తుతం ఏ రాష్ట్రం నుంచి కూడా పారాబాయిల్డ్ రైస్ తీసుకోవ‌డం లేదు. పంజాబ్ నుంచి ఒక్క గింజ కూడా బాయిల్డ్ రైస్ తీసుకోలేదు. ఎఫ్‌సీఐ నేరుగా ధాన్యం సేక‌రించ‌దు. ధాన్యాన్ని మిల్లింగ్ చేసినందుకు మిల్ల‌ర్ల‌కు డ‌బ్బు చెల్లిస్తాం. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలూ ఒకే వాతావ‌ర‌ణ జోన్‌లో ఉన్నాయి. ఏపీలో రాని స‌మస్య తెలంగాణ‌లో ఎందుకు వ‌స్తోంది? దేశంలో ఇప్ప‌టికే ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని అవ‌లంబిస్తున్నాం" అని ఆయ‌న ప్ర‌క‌టించారు.

  • Loading...

More Telugu News