America: అమెరికా అధ్యక్షుడితో మోదీ భేటీ ప్రారంభం.. యుద్ధంపైనే చర్చ
- వర్చువల్‌గా భేటీ అయిన ఇరు దేశాధినేతలు
- రష్యా, ఉక్రెయిన్ల యుద్ధంపైనే చర్చ
- యుద్ధం ఆపే దిశగా భారత్ కృషిని వెల్లడించిన మోదీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ భేటీ కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ భేటీలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంపైనే ఇరు దేశాధినేతలు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు సంయమనం పాటించే దిశగా భారత్ చేసిన కృషిని బైడెన్‌కు మోదీ వివరించారు.
ఇప్పటికే అటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో పలుమార్లు ఫోన్లో మాట్లాడానని చెప్పిన మోదీ.. యుద్ధం ఆపే దిశగా చర్యలు తీసుకోవాలని వారిద్దరికీ సూచించానని చెప్పారు. అదే సమయంలో మానవతా దృక్పథంతో ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నామని కూడా మోదీ తెలిపారు. ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో రష్యా పాల్పడిన దురాగతంపై కూడా భారత్ తన విచారం వ్యక్తం చేసినట్టు మోదీ వివరించారు.