Akbaruddin Owaisi: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కేసుల్లో నేడు తుదితీర్పు.. పాతబస్తీలో కట్టుదిట్టమైన బందోబస్తు
- 9 ఏళ్ల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రెచ్చగొట్టేలా ప్రసంగం
- 30 మంది సాక్షులను విచారించిన కోర్టు
- ఆ గొంతు అక్బరుద్దీన్‌దేనని నిర్ధారించిన ఫోరెన్సిక్ ల్యాబ్
- తీర్పు సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల అప్రమత్తం
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసుల్లో నేడు తుది తీర్పు వెల్లడి కానుంది. 9 సంవత్సరాల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో అక్బరుద్దీన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ ముగిసింది.
ఇందులో భాగంగా 30 మందికిపైగా సాక్షులను కోర్టు విచారించింది. అలాగే, ఆ ప్రసంగంలోని గొంతు అక్బరుద్దీన్‌దేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ఇప్పటికే నిర్ధారించింది. విచారణ ముగిసిన నేపథ్యంలో కోర్టు నేడు తుది తీర్పు వెలవరించనుంది. తీర్పు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పాతబస్తీలో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు.