AP High Court: సేవపై సమీక్షించాలన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి... కుదరదన్న హైకోర్టు
- కోర్టు ధిక్కరణ కేసులో శ్రీలక్ష్మి సహా 8 మంది ఐఏఎస్‌లకు శిక్ష
- ఐఏఎస్‌లంతా సారీ చెప్పడంతో సేవగా మార్పు
- శ్రీలక్ష్మి పిటిషన్ ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు
ఏపీ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తాజాగా హైకోర్టులో షాక్ తగిలింది. కోర్టు ధిక్కరణ కేసులో శిక్షకు గురైన శ్రీలక్ష్మి అక్కడికక్కడే క్షమాపణ చెప్పడంతో ఆ శిక్షను సేవగా మారుస్తూ ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏడాది పాటు నెలకో రోజు ప్రభుత్వ వసతి గృహాల్లో సేవ చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.
అయితే ఈ సేవ విషయంలో పునఃసమీక్ష చేయాలంటూ శ్రీలక్ష్మి తాజాగా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను తొలుత విచారణకే స్వీకరించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ నిరాకరించగా.. తాజాగా శ్రీలక్ష్మి తరఫు న్యాయివాది వివరణతో పిటిషన్‌ను విచారణకు అనుమతించారు. ఈ క్రమంలో బుధవారం నాడు విచారణ చేపట్టిన హైకోర్టు శ్రీలక్ష్మి పిటిషన్‌ను కొట్టివేసింది.