Russia Defence Minister: రష్యా రక్షణ మంత్రికి గుండె పోటు?
- కొంత కాలంగా కనిపించకుండా పోయిన రక్షణ మంత్రి
- గుండెపోటుకు గురయ్యారన్న వ్యాపారవేత్త లియనిడ్
- సహజంగా వచ్చిన గుండెపోటు కాదని వ్యాఖ్య
ఓ వైపు ఉక్రెయిన్ పై యుద్ధం జరుగుతున్న సమయంలోనే రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ పై దాడి ప్రారంభమైన తర్వాత దాదాపు 20 మంది రష్యన్ జనరళ్లు అరెస్ట్ అయ్యారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో... రక్షణమంత్రి గురించి వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి.