Payyavula Keshav: వదిలేస్తే దేశవ్యాప్తంగా ఈ విష సంస్కృతి విస్తరిస్తుంది.. కోర్టులో చోరీపై పయ్యావుల ఆందోళన
- కోర్టులో డాక్యుమెంట్ల చోరీని తీవ్రంగా పరిగణించాలన్న పయ్యావుల
- సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్
- కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచన
నెల్లూరు కోర్టులో బుధవారం రాత్రి జరిగిన చోరీపై టీడీపీ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని ఇలా వదిలేస్తే.. ఈ విష సంస్కృతి దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన కోర్టులో చోరీపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కూడా పయ్యావుల డమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పయ్యావుల చెబుతూ... 'కోర్టులో డాక్యుమెంట్ల చోరీని తీవ్రంగా పరిగణించాలి. కోర్టులో డాక్యుమెంట్లు లేకుండా చేయాలని చూశారు. ఇలానే వదిలేస్తే ఈ విష సంస్కృతి దేశం మొత్తం విస్తరిస్తుంది. నేరగాళ్లు ఇలానే ప్రవర్తించే అవకాశం ఉంది. కోర్టు పర్యవేక్షణలోనే ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలి. చోరీకి గురైన డాక్యుమెంట్లకు చెందిన కేసు నిందితులకు బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలి. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేయాలి' అని డిమాండ్ చేశారు.