Brain Cancer: ఆ స్కూల్లో చదివిన వాళ్లకు బ్రెయిన్ క్యాన్సర్... ఎక్కడంటే...!

Brainn Cancer attacks on these particular school students

  • న్యూజెర్సీలోని వూడ్ బ్రిడ్జ్ లో కలోనియా హైస్కూల్
  • ఇక్కడ చదివిన 102 మందికి క్యాన్సర్
  • అది కూడా ప్రమాదకర బ్రెయిన్ క్యాన్సర్
  • భార్య, సోదరిని పోగొట్టుకున్న లుపియానో
  • లోతుగా పరిశోధించగా ఆసక్తికర అంశాల వెల్లడి

అమెరికాలోని న్యూజెర్సీలోని వూడ్ బ్రిడ్జ్ లో ఉన్న కలోనియా హైస్కూల్ అనూహ్యరీతిలో వార్తల్లోకెక్కింది. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు, పనిచేసిన ఉపాధ్యాయుల్లో చాలామంది క్యాన్సర్ బారినపడ్డారు. 100 మందికి పైగా క్యాన్సర్ అని తేలింది. ఇక్కడ చదివిన విద్యార్థులు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులు కాలక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. అయితే, వారిలో చాలామంది క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అది కూడా బ్రెయిన్ క్యాన్సర్ కావడం గమనార్హం. 

కలోనియా హైస్కూల్లో చదువుకున్న లుపియానో గత 20 ఏళ్లుగా మెదడులో క్యాన్సర్ కణితితో బాధపడుతున్నారు. ఆయన భార్య, సోదరి కూడా మెదడులో ట్యూమర్ తో బాధపడుతున్నారు. లుపియానో భార్య, సోదరి ఇటీవలే మరణించారు. లుపియానో మాత్రం కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 50 ఏళ్లు. ఈ నేపథ్యంలో, ఆయన ఒకే కుటుంబంలో పలువురికి క్యాన్సర్ సోకడంపై కాస్త లోతుగా ఆలోచించారు. 

ఈ క్రమంలో కలోనియా హైస్కూల్ లో చదువుకున్న విద్యార్థుల ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్నారు. దాంతో 102 మంది తనలాగే బ్రెయిన్ క్యాన్సర్ బారినపడినట్టు గుర్తించారు. వారందరూ 1975 నుంచి 2000 సంవత్సరం మధ్య కాలంలో ఆ స్కూల్లో చదివారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో వారు స్కూల్లో పరిశోధనలు చేపట్టారు. రేడియో ధార్మికత పదార్థాలు ఏవైనా విద్యార్థులపై ప్రభావం చూపాయేమో అన్న కోణంలో దృష్టి సారించారు.  

ఈ విషయం తెలియడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వూడ్ బ్రిడ్జ్ మేయర్ జాన మెక్ కార్మాక్ దీనిపై స్పందిస్తూ, ఇదొక అసాధారణ అంశమని, ఇంతమందికి బ్రెయిన్ కాన్సర్ రావడానికి గల కారణాలేంటో తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారన తెలిపారు.

  • Loading...

More Telugu News